ట్రాఫిక్​సమస్యను పరిష్కరిద్దాం..సలహా ఇవ్వండి: సైబరాబాద్ ట్రాఫిక్ జేసీ

ట్రాఫిక్​సమస్యను పరిష్కరిద్దాం..సలహా ఇవ్వండి: సైబరాబాద్ ట్రాఫిక్ జేసీ
  • సైబరాబాద్ ట్రాఫిక్ జేసీ జోయల్​డేవిస్

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని సైబరాబాద్ ట్రాఫిక్​జాయింట్​కమిషనర్​జోయల్ డేవిస్ ఐటీ కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు.

శుక్రవారం గచ్చిబౌలిలోని ఫోనిక్స్ ఇన్ఫోసిటీ, రాయదుర్గంలోని సత్వ నాలెడ్జ్​ సిటీలో పలు సంస్థల ప్రతినిధులతో క్లస్టర్​మీటింగ్​నిర్వహించారు. ఎస్సీఎస్సీ జనరల్​సెక్రటరీ రమేష్​ తో కలిసి మాట్లాడారు. పలు అంశాలపై చర్చించారు. కంపెనీల మేనేజ్​మెంట్​లు అనుసరించాల్సిన వ్యూహాలు, పరిష్కార మార్గాలను వివరించారు.