హైదరాబాద్, వెలుగు: ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా సత్తా చాటాడు. జూనియర్ మెన్స్ 4000 మీటర్ల టీమ్ సర్క్యూట్‌లో బ్రాంజ్ నెగ్గాడు. ఢిల్లీలో శనివారం జరిగిన ఫైనల్లో ఆశీర్వాద్, నీరజ్ కుమార్, బిర్జిత్ యమ్నమ్, గుర్నూర్ పూనియాతో కూడిన ఇండియా టీమ్ 4:22.737 టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ సాధించాడు. కాగా, ఈ టోర్నీ తొలి రోజు పోటీల్లో ఇండియా ఒక గోల్డ్ సహా పది మెడల్స్ గెలిచింది.
