అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం చెరువులో పెద్ద సుడిగుండం

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం చెరువులో పెద్ద సుడిగుండం

ఆంధ్రప్రదేశ్లో మిచాంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది.  మంగళవారం (డిసెంబర్5) బాపట్ల దగ్గర తీరం దాటిన మిచాంగ్ తుపాన్ భూమిపైకి విధ్వంసం సృష్టిస్తోంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తీరందాటుతూ పెనువిధ్వంసం సృష్టించాయి.మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అన్నవరం సత్యనా రాయణ స్వామి దేవాలయం ఆనుకుని ఉన్న కొండ దిగువ ప్రాంతం పక్కన చెరువులో కలకలం రేగింది. చెరువులో ఈదురు గాలులు విలయ తాండవం చేశాయి. ఒక్కసారిగా చెరువులో సుడులు తిరుగుతూ గాలి  చెరువులో నీటిని పైకెత్తి పోశాయి. చెరువులో సుడిగుండం ఏర్పడి నీటిని ఆకాశంలోకి విసిరింది.  చెరువులో నీరు వలయాకారంతో పైకి లేచి చెరువు మొత్తం తిరుగుతూ చేసేవారిని భయాందోళనకు గురి చేసింది. 

తుఫాన్ మిచౌగ్.. తీరం దాటటంతో.. అతి భారీ.. కుండపోత వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్నా జిల్లాల్లోని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బయటకు రావొద్దని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. అతి భారీ వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగుతాయని.. చెరువుల కట్టలు తెగే ప్రమాదం ఉందని.. ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. 

తుఫాన్ మిచౌంగ్ తీరం దాటే సమయంలో పెను గాలులకు పంటలు దెబ్బతిన్నాయని.. రహదారులు ధ్వంసం అయ్యాయని అధికారులు వెల్లడించారు. 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విధ్వంసం చేశాయని.. వర్షాలు తగ్గిన తర్వాత నష్టం అంచనాకు వస్తుందని స్పష్టం చేశారు అధికారులు. తుఫాన్ తీరం దాటినా.. సముద్రం అల్లకల్లోలంగా ఉందని.. 50 మీటర్లు ముందుకు వచ్చిందని.. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని.. ఎవరూ సముద్రం వైపు వెళ్లొద్దని అధికారులు ప్రకటించారు. ఏపీలోని ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, విజయనగరం, రాజమండ్రి, విశాఖపట్నం, ఏలూరు జిల్లాలకు రెడ్​అలర్ట్ జారీ అయ్యింది. మిగతా జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తీర ప్రాంత  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.