దిత్వా తుఫాన్ శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు శ్రీలకం ద్వీపం అతలాకుతలం అయ్యింది. ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయి జలదిగ్బంధం అయ్యింది. దిత్వా ధాటికి లంకలో ఇప్పటి వరకు 46 మంది చనిపోయారు. శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా ఇండియా వైపుకు దులుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీలంక తీర ప్రాంతం నైరుతు బంగాళా ఖాతం నుంచి ఆగ్నేయం దిశగా 6 గంటల్లో 4 కి.మీ. కదిలినట్లు పేర్కొన్నారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతున్న దిత్వా తుఫాన్.. పుదుచ్చేరికి 420 కి.మీ., చెన్నైకి 520 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీలంక తీరం నుంచి ఆగ్నేయ దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపు కదులుతున్నట్లు తెలిపారు.
దిత్వా ప్రభావంతో తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 64 నుంచి 83 కి.మీ. వేగంగా గాలువు వీస్తాయాని పేర్కొన్నారు అధికారులు. సముద్ర ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెప్పారు. తమిళనాడు తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని.. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
దిత్వా తుఫాన్ ప్రభావంతో నవంబర్ 30న ఏపీలో పలు చోట్ల వర్షాలకు చాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఆదివారం (నవంబర్ 30) తమిళనాడు, ఏపీ తీరానికి చేరుకోనున్న దిత్వా కారణంగా.. ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా రాయలసీమలో కూడా అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
