ఏపీకి తుపాన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీకి తుపాన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం డిసెంబర్ 3న తుఫానుగా మారనుంది. డిసెంబర్ 4 సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నం, చెన్నై మధ్య మిచాంగ్ తీరం దాటుతుందని ఐఎండీ వెల్లడించింది. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.  ప్రస్తుతం వాయుగుండం, నెల్లూరుకు 860 కిలో మీటర్లు, మచిలీ పట్నానికి 910 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. నెల్లూరు-మచిలీ పట్నం  మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తర్వాత దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి డిసెంబర్ 5న నెల్లూరు , మచిలీపట్నం మధ్య తుపాను 80-90 కి.మీ వేగంతో తీరం దాటుతుందని తెలిపింది. 

తుపాను ప్రభావంతో డిసెంబర్ 4, 5వ తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలెర్ట్ చేసింది. డిసెంబర్ 5న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 

డిసెంబర్ 3న రాయలసీమ, కోస్తా,యానాంలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలెర్ట్ ను ప్రకటించింది. అదే రోజు ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్  ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారి చేసింది వాతావరణ శాఖ.