బీఆర్ఎస్ తరపున పోటీ చేయను..! :మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

బీఆర్ఎస్ తరపున పోటీ  చేయను..! :మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీచేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నానే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను ఏ పార్టీలో చేరుతానన్న విషయాన్ని త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.  కానీ ఈలోగా మీడియా తనను రోజుకో పార్టీలో చేర్చుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.  

చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా భావిస్తే రైట్ టు ప్రైవసీ కి భంగం కలిగిందని ఫిర్యాదు చేసి విచారణ కోరవచ్చని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్దత ఉందని.., నిరాధార ఆరోపణలు పని చేయవన్నారు. దేశమంతటా రైతులకు ప్రాధాన్యత ఉందన్న లక్ష్మీ నారాయణ... రాష్ట్రాలు కూడా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విశాఖ రాజధాని మార్పు అనేది సుప్రీం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తే చెల్లవన్నారు.  అలా చేస్తే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుందన్నారు.