డీఎస్ కుటుంబంలో చేరికల చిచ్చు..కాంగ్రెస్కు డీఎస్ రాజీనామా

డీఎస్ కుటుంబంలో చేరికల చిచ్చు..కాంగ్రెస్కు డీఎస్ రాజీనామా

మాజీ ఎంపీ డీ శ్రీనివాస్ కాంగ్రెస్ లో  చేరికపై ఆయన కుటుంబంలో చిచ్చు రేగినట్లు తెలుస్తోంది.  మార్చి 26వ తేదీన ఆదివారం కాంగ్రెస్ లో  డీ శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్ చేరారు. అయితే మార్చి 27వ తేదీ సోమవారం డీఎస్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను రాస్తున్న వీడియోను విడదల చేశారు. 

డీఎస్ భార్య రిక్వెస్ట్..

డీ శ్రీనివాస్ రాజీనామా విషయాన్ని ఆయన భార్య విజయలక్ష్మీ వీడియో ద్వారా వెల్లడించారు. నమస్తే ఇది డీ శ్రీనివాస్ రాజీమానా ..నేను చెప్పదల్చుకున్నది ఏంటీ అంటే కాంగ్రెస్ వాళ్లు కానీ..మీడియా వాళ్లు కానీ ఇటువైపు రాకండి..అని డీ విజయలక్ష్మీ వీడియోలో స్పష్టం చేశారు. 

రాజకీయాలకు దూరంగా..

ఇది రాజకీయాలు చేసే సమయం కాదు..డీఎస్ ను పార్టీలో చేర్చుకునే విధానం ఇది కాదు..డీఎస్ అనారోగ్యంతో ఉన్నారు. మీ రాజకీయాలకు డీఎస్ ను వాడుకోవద్దని డీఎస్ భార్య విజయలక్ష్మీ స్పష్టం చేశారు. అటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్ తెలిపారు. తనను వివాదాల్లోకి లాగొద్దని డీఎస్ విజ్ఞప్తి  చేశారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని స్పష్టం చేశారు.