ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.144 శాతం పెంపు

V6 Velugu Posted on Jul 31, 2021

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఫించన్ దారులకు కరవు భత్యం (డీఏ) 3.144 శాతం మేర పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు.
మూలవేతనంపై 30.392 శాతం నుంచి 33.536 శాతానికి డీఏ పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డీఏ పెంపుదల ఉత్తర్వులు 2019 జనవరి 1 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయితీలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బందికి డీఏ పెంపుదల ఉంటుంది. 2021 జులై నెల వేతనంతో పెంచిన డీఏను చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 

Tagged DA, ap today, July 21, , amaravati today, viajaywada today, government employees and pensioners, New DA effect from, January 2019

Latest Videos

Subscribe Now

More News