మైసూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో దాదాగిరి పునఃప్రారంభమైంది

మైసూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో దాదాగిరి పునఃప్రారంభమైంది

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దాదా’. మంగళవారం నుంచి ఈ మూవీ షూటింగ్ మైసూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పునఃప్రారంభమైంది. ఇటీవల గాయపడిన బాలకృష్ణ కోలుకుని తిరిగి షూటింగ్ సెట్స్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. కీలకమైన, లెంగ్తీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో ఆయన  పాల్గొంటున్నారు.  ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో ప్రధానంగా టాకీ పార్ట్‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణతో పాటు కీలక పాత్రలు పోషిస్తున్న మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కూడా   షూటింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటున్నారు.   

ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు.  భారీ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.   తమన్ సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు  నిర్మిస్తున్నారు. ‘వీర సింహారెడ్డి’ తర్వాత  బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.