
పట్టపగలు.. నట్టనడి రోడ్డుపైన జనం చూస్తుండగానే దాదాగిరికి దిగారు ఫార్చునర్ కారులో వచ్చిన యువకులు. కారును ఓవర్ టేక్ చేశారని రోడ్డుపైనే కారు ఆపి బైక్ పై ఉన్న యువకులపై దాడికి దిగారు. బైక్ పై ను కిందికి తోసి మీదపడి పొట్టుపొట్టు కొట్టారు. కిక్ బాక్సింగ్ చేస్తున్నారా అన్నట్లుగా పిడిగుద్దులు గుద్దారు. అంతటితో ఆగకుండా బ్యాట్ తో విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ బండ్లగూడలో సోమవారం (ఆగస్టు 25) చోటు చేసుకుంది.
మధ్యాహ్నం యువకులు బైక్ పై వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ఫార్చూనర్ కార్ బైకు ముంది ఆపిన గుర్తు తెలియని వ్యక్తులు.. బైక్ పై వెళ్తున్న యువకులను కిందికి తోసేశారు. మా కారుకే సైడ్ కొడతావా అంటూ మీదపడి దాడికి దిగారు. బండ్లగూడ సవేరా హోటల్ దగ్గర దాడి జరగటంతో ట్రాఫిక్ జాం అయ్యింది.
అందరూ చూస్తుండగా.. బైక్ పై వెళుతున్న వ్యక్తిపై పట్టపగలే దాడి చేయడం దారుణం అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిని ఆపాలని చూసినా వినిపించుకోలేదని తెలిపారు. దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.