
హైదరాబాద్, వెలుగు: దక్షిణ కొరియా కంపెనీ డేవూ మన దేశ మార్కెట్లోకి లూబ్రికెంట్లను విడుదల చేసింది. వీటి తయారీ కోసం మంగళి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, మంగళి ఇండస్ట్రీస్ భారతదేశ ఆటో పరిశ్రమ కోసం డేవూ గల లూబ్రికెంట్లను ఉత్పత్తి చేస్తుంది. పంపిణీ చేస్తుంది. టూవీలర్లు, ప్యాసింజర్కార్లు, వాణిజ్య, వ్యవసాయ వాహనాల కోసం వీటిని తయారు చేశామని తెలిపింది. ఇవి ప్రీమియం శ్రేణి హై పర్ఫార్మెన్స్ లూబ్రికెంట్లని, భారతీయ డ్రైవింగ్ పరిస్థితులకు అనువుగా ఉంటాయని పేర్కొంది.