పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిందని బాధపడుతున్నారా..? అయితే రోజూ 42 గ్రాముల బాదం తినండి. ఎందుకంటే రోజూ బాదం తినడం వల్ల కొవ్వు కరిగిపోతుందని అమెరికా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం వెల్లడించింది.
అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివ ర్సిటీ పరిశోధకులు అధిక బరువు కలిగిన 52 మంది వ్యక్తులపై, పన్నెండు వారాలపాటు అధ్యయనం చేశారు. ఈ స్టడీ ఫలితాల ప్రకారం వేరే స్నాక్స్ తీసుకున్న వారితో పోలిస్తే రోజూ బాదం తిన్న వారి ఒంట్లోని చెడు కొవ్వు చాలా వరకు తగ్గిపోయింది.
ఎల్ డీ ఎల్ (లోడెన్సిటీ లైపోప్రొ టీన్) అనే చెడు కొవ్వు కరగడం వల్ల హృద్రోగాలు కూడా రాకుండా ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బాదం తినాలి. వీలుంటే. రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం పొట్టు తీసేసి తింటే మంచి ఫలితం ఉంటుంది. సాయంత్రం స్నాక్స్ గా ఇతర ఆయిల్ ఫుడ్ కాకుండా, ఓ గుప్పెడు బాదం పప్పు తినడం ఆరోగ్యకరమని పరిశోధకులు సూచిస్తున్నారు.
►ALSO READ | నాగులచవితి ( అక్టోబర్ 25)2025 : పుట్టలో పాలు పోసేటప్పుడు చదవాల్సిన మంత్రాలు ఇవే..!
