గవర్నమెంట్‌ ఉద్యోగులకు ‘ఆరోగ్య సేతు’ కంపల్సరీ

గవర్నమెంట్‌ ఉద్యోగులకు ‘ఆరోగ్య సేతు’ కంపల్సరీ
  • హెల్త్‌ చేక్‌ చేసుకున్న తర్వాతే ఆఫీస్‌కు రావాలి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య సేతు యాప్‌ను కంపల్సరీ చేస్తూ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని అధికారులు చెప్పారు. యాప్‌లో హెల్త్‌ చెక్‌ అయిన తర్వాతే ఆఫీసులకు రావాలని సూచించారు. వర్క్‌కు వచ్చే ముందు యాప్‌లో తమ హెల్త్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకుని రావాలని “ ఎఫెక్టివ్‌ యూజ్‌ ఆఫ్‌ ‘ఆరోగ్య సేతు’ యాప్‌ టూ బ్రేక్‌ ద చైన్‌ ఆఫ్‌ కరోనా” అనే పేరుతో ఆర్డర్‌‌ రిలీజ్‌ చేశారు. “ ఒక వేళ యాప్‌లో “మోడరేట్‌”/ “ హై రిస్క్‌” అని చూపిస్తే 14 రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత స్టేటస్‌ను బట్టే ఆఫీస్‌కు రావాలి” అని ఆర్డర్‌‌లో చెప్పారు. కరోనాకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోగ్య సేతు యాప్‌ను ప్రవేశపెట్టింది.