పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతుల రాస్తారోకో

పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతుల రాస్తారోకో

కల్వకుర్తి, వెలుగు: విజయ డెయిరీ నుంచి రెండు నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని పేర్కొంటూ సోమవారం పాడి రైతులు మండలంలోని తాండ్ర గేట్  రోడ్​పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పాల బిల్లు రాకుంటే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక్కో రైతుకు రూ. 50 వేల వరకు బకాయిలు ఉన్నాయని వాపోయారు. పాల బిల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​  ముట్టడిస్తామన్నారు. కుమ్మరి హనుమంతు, సంతోష్ రెడ్డి, మల్లేశ్, కృష్ణ, జంగయ్య, వివిధ పార్టీల నాయకులు ఎట్టి ఆంజనేయులు, ఆనంద్, బొట్టె శ్రీను, ముద్రకోళ్ల శివయ్య, కమ్మరి రంగయ్య పాల్గొన్నారు.