
హైదర్ గూడ : సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు జరిగిన అవమానంపై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ హైదర్ గూడలో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అయిన వంశీకృష్ణను దళితుడు అనే నెపంతోనే సరస్వతి పుష్క రాలకు ఆహ్వానించలేదు. ఇన్విటేషన్ లో ఆయన ఫొటో పెట్టకుండా ప్రొటోకాల్ ను విస్మరించారు. దేవాదాయశాఖ అధికారు లు కావాలనే ఇలా చేశారు. ఇది యాపత్ దళిత జాతిపై జరిగిన వివక్ష, రాష్ట్ర ప్రభుత్వా నికి 24 గంటలు టైం ఇస్తున్నం. బేషరతుగా గడ్డం వంశీ కృష్ణకు క్షమాపణ చెప్పాలి. ఈనెల 26 వరకు పుష్కరాల్లో ఆయనను ఆహ్వానించి ప్రొటోకాల్ పాటించాలి. లేని పక్షంలో దేవాదాయశాఖ కమిషనర్ కార్యా లయం ముట్టడితో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తం. పార్లమెంట్ హౌజ్ కమిటీకి అప్పీల్ చేసి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతాం. అంబేద్కర్ విధానాలు, రాజ్యాం గానికి విరుద్ధంగా దేవాదాయ శాఖ అధికా రులు వ్యవహరించారు. రేపటినుంచి అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తం' అని తెలిపారు.
బాధ్యులపై అట్రాసిటీ కేసు పెట్టాలె
సిద్దిపేట: దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవ మానించిన దేవాదాయశాఖ అధికారులపై చర్యలు తీసుకోలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి .శంకర్ డిమాండ్ చేశారు. సరస్వతీ పుష్కరాలకు ఆయన్ను ఆహ్వానించకుండా కుల వివక్ష పాటిం చారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషనర్ బక్కీ వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. ఆహ్వాన పత్రికలలో ఎంపీ ఫొటో పెట్టక పోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీల పట్లనే వివక్ష కొనసాగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. దేవదాయశాఖ అధి కారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. తమ ఫిర్యాదుపై స్పందించిన చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శికి నోటీస్ జారీ చేశారని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో హైకోర్టు న్యాయవాది దివాకర్ పూలే. నాయకులు బిట్ల వెంకటేశ్వర్లు, రాజు వస్తాద్ తదితరులున్నారు.