ఆర్థికశాఖ స్పెషల్​ సీఎస్​పై కంప్లయింట్

ఆర్థికశాఖ స్పెషల్​ సీఎస్​పై కంప్లయింట్
  • బడ్జెట్ మంజూరు చేయకుండా  నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు:  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  కేసుల బడ్జెట్ మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణా రావు పై  దళిత నేతలు కంప్లయింట్ చేశారు.​ ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సభ్యులు బత్తుల రాంప్రసాద్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బోయిని ఎల్లేశ్  తదితరులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్​లో గురువారం ఫిర్యాదు​ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  పదేండ్ల నుంచి రామకృష్ణారావు కావాలనే ఎస్సీ, ఎస్టీల బడ్జెట్ మంజూరులో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమీక్ష సమావేశాలు నిర్వహించలేదన్నారు. అట్రాసిటీ బాధితులకు రావాల్సిన నష్టపరిహారం నిధులు కూడా విడుదల చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారన్నారు.  ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్​ రామకృష్ణ రావు దళితుల నిధులపై కుట్రలు చేస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారన్నారు.