
హైదరాబాద్, వెలుగు: కానిస్టేబుల్ పోస్టు కోసం ఓ దళిత మహిళ ఎనిమిదేండ్లు న్యాయ పోరాటం చేసి విజయం సాధించింది. సివిల్/ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంలో స్థానికేతర అభ్యర్థిగా పోస్టును నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ గౌలిగూడకు చెందిన సంగీత 2017లో పిటిషన్ వేశారు. పిటిషనర్‌ను ఎస్సీ రిజర్వేషన్, స్థానిక కోటా కింద రిక్రూట్ చేసుకోవాలని గత మార్చిలో సింగిల్ జడ్జి తీర్పు చెప్పా రు.
ఈ తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అప్పీలు దాఖలు చేశాయి. పిటిషనర్ 4 నుంచి 7 వరకు రంగారెడ్డిలో, 8 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో చదివినందున రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థిగానే పరిగణించాలన్న సింగిల్ జడ్జి తీర్పులో జోక్యానికి హైకోర్టు నిరాకరించి.. అప్పీలును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.