దళితబంధు డబ్బులు అకౌంట్ లో నుండి మళ్లీ వెనక్కి..

V6 Velugu Posted on Sep 15, 2021

హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు స్కీంను పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కొందరిని యూనిట్లు కూడా మంజూరయ్యాయి. అయితే కొందరికి మాత్రం డబ్బులు అకౌంట్ లో క్రెడిట్ అయ్యి.. కొద్ది రోజులకే మళ్లీ డెబిట్ అయిపోయాయి. ఏకంగా దళితబంధు కోసం కొత్తగా తీసిన బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ అయినట్టు మెస్సేజ్ లు వచ్చాయి. దీంతో హుజురాబాద్ కు చెందిన దళితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది తమను అవమానపరచడమే అవవుతుందన్నారు. బ్యాంకు అధికారులను కలిస్తే డబ్బులు ఎందుకు వెనక్కి వెళ్లాయో తమకు తెలియదని సమాధానం చెబుతున్నారని ఆవేధన వ్యక్తంచేశారు. డబ్బులు వెనక్కి వెళ్లిపోవడంతో.. ప్రమీల అనే మహిళ డీర్డీడీవో పీడీ శ్రీనివాస్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. తాము పరిశీలిస్తామని చెప్పారు అధికారి. 

Tagged Huzurabad Constituency, Dalitbandhu money, debite, some accounts

Latest Videos

Subscribe Now

More News