దళిత బంధు దేశంలోనే ఒక చరిత్ర

దళిత బంధు దేశంలోనే ఒక చరిత్ర

మేడ్చల్ జిల్లా: రైతులను రాజులను చేయాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ పథకం కింద మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 561 మంది లబ్దిదారులను గుర్తించినట్లు చెప్పారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మొదటి విడత 100 మందికి దళిత బంధు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశంలో ఒక చరిత్ర అన్నారు. అందరూ దళితుల ఓట్లతో గెలిచారు కానీ వారిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. దళితులను ధనవంతులను చేయాలని.. రాజులు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చారని చెప్పారు. దళితుల కుటుంబాల్లో ఉద్యోగస్తులున్నా.. వ్యాపారస్తులున్నా.. ఎవరికైనా సరే దళితుడైతే చాలు దళిత బంధు పథకం వర్తిస్తుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బోన్లతో డాక్టర్ల నిరసన

22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్

వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట

మా పిల్లలను డ్రగ్స్ టెస్ట్ కు తీసుకొస్తా..