దళితులకు భూమి ఇవ్వడం కాదు ఉన్నవి లాక్కుంటుండు

దళితులకు భూమి ఇవ్వడం కాదు ఉన్నవి లాక్కుంటుండు
  • దళిత, రజక సామాజిక వర్గాల భూములను లాక్కోవడం దారుణం
  • భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా: దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం కాదు కానీ.. అంతోఇంతో భూములున్న వారివి కూడా లాక్కుంటున్నారని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. పేదలకు ఆ భూములే జీవనాధారం..  ఆ భూములే లేకుంటే వారికి చావు తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. కనగల్ మండలం జి. యడవల్లి గ్రామంలో మెగా పల్లె ప్రకృతి వనం పేరుతో ప్రభుత్వం 43.30 ఎకరాల పట్టా  భూములు లాక్కుంటోందని  ఆందోళనలో ఉన్న భాదితులను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం పరామర్శించారు. 
ఈ సందర్బంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రజకులు ,దళితుల సామాజిక వర్గలకు చెందిన భూములను తీసుకోవడం దారుణం అన్నారు. నిరుపేదలైన వారికి ఆ భూములే జీవనోపాధి అని.. అలాంటి భూములు లేకుంటే వాళ్లకు సావ్వు తప్ప వేరే మార్గం లేదన్నారు. రెవెన్యూ అధికారులు బెదిరించి పంటవేసిన భూముల నాశనం చేశారని ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ తోపా న్యాయ నిపుణులతో మాట్లాడి సుప్రీంకోర్టులో పోరాటం చేస్తానని..  మీకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఎవరు కూడా భయపడొద్దని.. బాధితులకు అండగా ఉంటనాని భరోసా ఇచ్చారు. దళితులకు ఇంటికి 10 లక్షలు ఇస్తానని ఇతర వర్గాల కుటుంబాలను కేసీఆర్  మోసం చేస్తున్నారని విమర్శించారు. బాధిత కుటుంబాలు ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటే జిల్లా మంత్రి ,స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. బాధితుల సమస్యని ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి పరిష్కరించాలని ఆయన డిమాండు చేశారు.