
ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్ లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని.. అయినా వేలంలో ఒక్క లోకల్ ప్లేయర్ ను ఎంపిక చేయలేదన్నారు. హైదరాబాద్ ప్లేయర్లను ఎంపిక చేయాలని.. లేదంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తన టీం పేరు మార్చుకోవాలన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన వార్నర్ టీంకు కెప్టెన్ గా ఉన్నాడని..లోకల్ ప్లేయర్లు లేకపోవడమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ లో జరిగే ఐపీఎల్ సన్ రైజర్స్ మ్యాచ్ లను అడ్డుకుంటామన్నారు దానం నాగేందర్.