దండేపల్లి MPP ఎన్నికలో అభ్యర్థుల ఆందోళన

దండేపల్లి MPP ఎన్నికలో అభ్యర్థుల ఆందోళన

మంచిర్యాల జిల్లా దండేపల్లి యంపీపీ ,కో ఆప్షన్ ఎన్నికోగ రసాభాసగా మారాయి. మండలంలో 14 స్థానాలకు గాను 8 స్థానాల్లో కాంగ్రెస్, 6 టీఆరెస్ దక్కించుకుంది.  కాంగ్రెస్ కు తగిన మెజారిటీ ఉండటంతో.. పసర్తి అనిల్ ,రవిలు ఎంపీపీ స్థానానికి పోటీ పడ్డారు. ఎన్నికకు రవి తనతో పాటు ఆరుగురు ఎంపీటీసీలను తీసుకెళ్లాడు. అనిల్ ఎన్నికల కేంద్రానికి రాకపోవడంతో.. అతని భార్య వనిత తన భర్త వచ్చేంత వరకు ఎన్నిక నిర్వహించొద్దని ఆందోళనకు దిగింది. యంపీపీ పదవి ఆశించడం తోనే అనిల్ ను కిడ్నాప్ చేశారన్న ఆమె.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది.

ఎన్నికల కేంద్రం దగ్గర ఆందోళన కొనసాగుతుండగా… కిడ్నాప్ అయిన లక్ష్మీ కాంత పూర్ యంపిటిసి అనిల్ కుమార్ సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. తనను కిడ్నాప్ చేశారని ఎక్కడో బందించారని తాను వచ్చేంత వరకు ఎన్నికను వాయిదా వేయాలని సెల్ఫీ వీడియో లో కోరాడు అనిల్.

అటు కో ఆప్షన్ ఎన్నికలో కూడా ఉద్రిక్తంగా మారింది. కో ఆప్షన్ సభ్యునిగా నామినేషన్ వేసిన అల్లాఉద్దీన్ ఎన్నికలో… అధికారులు నిబంధనలు పాటించలేదని  చింతపల్లి ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ అభ్యంతరం చెప్పాడు. ఎన్నిక నిలిపేయాలని పెట్రోల్ పోసుకుని ఎన్నికల కేంద్రం నుంచి పరుగులు తీశాడు. ఈ సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల కేంద్రంలోకి  వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు చెదరగొట్టారు.