శానిటరీ ప్యాడ్లలో డేంజర్ కెమికల్స్

శానిటరీ ప్యాడ్లలో డేంజర్ కెమికల్స్

న్యూఢిల్లీ: దేశంలో అమ్ముడవుతున్న ప్రముఖ శానిటరీ న్యాపి కిన్ లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని స్టడీలో తేలింది. ఇన్ ఆర్గానిక్ తో పాటు ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ లోనూ హానికరమైన సలెట్స్, వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నట్లు వెల్లడైంది. ఈ స్టడీని ఢిల్లీకి చెందిన ఎన్జీవో ‘టాక్సిక్స్ లింక్’ నిర్వహించింది. దీనిపై ‘‘మెన్​స్ట్రువల్ వేస్ట్ 2022” పేరుతో రిపోర్టు విడుదల చేసింది. ‘‘మన దేశంలో కామన్ గా వాడుతున్న 6 ఇన్ ఆర్గానిక్, 4 ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్లను టెస్టు చేశాం. వాటన్నింటిలోనూ హానికరమైన సలెట్స్, వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు తేలింది. సలెట్స్ వల్ల ఎండోక్రైన్, గుండె సమస్యలు, షుగర్, క్యాన్సర్లు వస్తాయి. రీప్రొడక్టివ్ సిస్టమ్​పై ప్రభావం పడుతుంది. వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వల్ల ఆస్తమా, క్యాన్సర్లు వస్తాయి” అని రిపోర్టులో పేర్కొంది. శానిటరీ ప్యాడ్స్​లో వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అసిటోన్, క్లోరోఫోమ్, బెంజీన్, టోలున్ తదితరాలు ఉన్నట్లు వెల్లడించింది.

స్టడీ సూచనలివీ.. 

శానిటరీ ప్యాడ్స్ తయారీకి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ స్టడీ కొన్ని సూచనలు చేసింది. ఈ ప్రొడక్టుల్లో డేంజర్ కెమికల్స్ కు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. శానిటరీ ప్యాడ్స్ లో కెమికల్స్ వినియోగానికి సంబంధించి రూల్స్ తీసుకురావాలి.