వంద దేశాల్లో డెల్టా వేరియంట్‌‌.. ఇది భయానక సమయం 

వంద దేశాల్లో డెల్టా వేరియంట్‌‌.. ఇది భయానక సమయం 

జెనీవా: డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియోస్ ఆందోళన వ్యక్తం చేశారు. వరల్డ్ వైడ్‌గా దాదాపు 100 దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదవ్వడాన్ని గుర్తించామని అధనోమ్ తెలిపారు. కరోనా ప్రభావం మొదలయ్యాక ఇది అత్యంత ప్రమాదకర సమయమని హెచ్చరించారు. డెల్టా వేరియంట్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ డేంజరస్‌గా మారుతోందన్నారు. మహమ్మారి బారి నుంచి బయట పడాలంటే  వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. కాబట్టి వచ్చే ఏడాది ఈ టైమ్‌కు ప్రతి దేశంలో ఆ కంట్రీ జనాభాలో 70 శాతం మందికి టీకాలను ఇవ్వాలని సూచించారు. ఇందుకు అన్ని దేశాలు కలసికట్టుగా, పరస్పరం ఒకరికొకరు సహకరిస్తూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు.