వేర్వేరు టీకాలను కలిపి తీసుకుంటే చాలా డేంజర్

వేర్వేరు టీకాలను కలిపి తీసుకుంటే చాలా డేంజర్

జెనీవా: వేర్వేరు కంపెనీల టీకాలను కలిపి తీసుకోవడం సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ హెచ్చరించారు. ఇది డేంజరస్ ట్రెండ్ అని చెప్పిన సౌమ్యా.. వేర్వేరు టీకాల మిక్సింగ్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానికి సంబంధించి తమ దగ్గర కొంత డేటా అందుబాటులో ఉందన్నారు. ఏ డోస్‌ను ఎప్పుడు, ఎలా తీసుకోవాలనేది ప్రజలు తమంతట తామే నిర్ణయించుకుంటే అస్తవ్యస్తమైన పరిస్థితులు తలెత్తుతాయని వార్నింగ్ ఇచ్చారు. 

‘వేర్వేరు వ్యాక్సిన్‌లను కలిపి తీసుకునే దిశగా కొందరు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక కంపెనీ టీకాను ఫస్ట్ డోసుగా తీసుకున్నామని, రెండో డోసును మరో సంస్థ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందని మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. వ్యాక్సిన్ మిక్సింగ్‌కు సంబంధించి మా దగ్గర తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. ఈ దిశగా పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. మనం ఇంకొన్నాళ్లు ఎదురు చూడక తప్పదు. ఈ సమయంలో ఎదురుచూడటమే ఉత్తమమైన మార్గం’ అని సౌమ్యా స్వామినాథన్ సూచించారు.