Danush sir : సార్‌‌ సినిమా నుంచి బంజారా పాట

Danush sir : సార్‌‌ సినిమా నుంచి బంజారా పాట

ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం సార్ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 17న ఈ మూవీ థియేటర్స్‌లోకి రానుందని మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రిలీజ్ టైం దగ్గర పడటంతో చిత్ర బృందం రోజుకో కొత్త అప్‌డేట్ ఇస్తున్నారు. సంక్రాంతి కానుకగా సెకండ్ సింగిల్‌ పోస్టర్ రిలీజ్ చేశారు. జనవరి 17న బంజారా పాటను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మాస్టారు పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సార్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.