
తలైవా రజనీకాంత్ సినిమా అంటే అభిమానుల్లో క్రేజ్ ఎంత ఉంటుందో చెప్పక్కర్లేదు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ చేసిన ‘పేట’ సినిమా తర్వాత ఇప్పుడు ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దర్బార్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే తెలుగు మోషన్ పోస్టర్‌ను మహేష్ బాబు, తమిళ మోషన్ పోస్టర్‌ను కమల్ హాసన్ విడుదల చేశారు. కాగా, హిందీ పోస్టర్‌ను సల్మాన్ ఖాన్ మరియు మలయాళ పోస్టర్‌ను మోహన్‌లాల్ విడుదల చేశారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10, 2020న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో నయనతార, నివేధా థామస్, మరియు సునీల్ షెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Extremely happy to present the Telugu motion poster of @rajinikanth sir's #Darbar. Love & respect always! ? Best wishes to @ARMurugadoss sir & the entire team?? #DarbarMotionPoster https://t.co/PgL9D27nBp
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2019