డార్లింగ్ అంటే లైంగికంగా వేధించినట్టే

డార్లింగ్ అంటే లైంగికంగా వేధించినట్టే

     కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కోల్‌‌‌‌కత్తా :  పరిచయం లేని మహిళను డార్లింగ్‌‌‌‌ అని పిలిస్తే అది లైంగిక వేధింపుల కిందకే వస్తుందని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల ప్రకారం ఇది నేరమని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్‌‌‌‌ సేన్‌‌‌‌గుప్తా ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్డుపై వెళ్తున్న పరిచయంలేని  ఓ యువతినో, మహిళనో డార్లింగ్‌‌‌‌ అని పిలిచే స్థాయికి భారత సంస్కృతి ఇంకా దిగజారిపోలేదన్నారు. ఇది ఇండియన్‌‌‌‌ కల్చర్‌‌‌‌‌‌‌‌ కాదన్నారు. మద్యం మత్తులో ఇలాంటివి చేస్తే అది ఇంకా పెద్ద నేరం అవుతుందని తెలిపారు.