
ఆస్ట్రేలియాలోని డార్విన్ లో కాల్పులు జరిగాయి. ఓ హోటల్ లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి అక్కడ ఉన్న వారిపై గన్ తో కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా,పలువురికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఇది ఉగ్రవాదుల పని కాదని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు.