బంగ్లా ఎన్నికల బరిలో తారిఖ్‌‌ రెహమాన్.. రెండు స్థానాల నుంచి నామినేషన్ దాఖలు

బంగ్లా ఎన్నికల బరిలో తారిఖ్‌‌ రెహమాన్.. రెండు స్థానాల నుంచి నామినేషన్ దాఖలు

ఢాకా: బంగ్లాదేశ్‌‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. 17 ఏండ్ల తర్వాత స్వదేశానికి తిరిగివచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) యాక్టింగ్ చైర్మన్ తారిఖ్‌‌ రెహమాన్‌‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు.  ఢాకా-17తో పాటు బొగురా-6  నియోజకవర్గాల నుంచి ఆయన తరఫున పార్టీ నేతలు నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో ఆయన బీఎన్పీ అధికారిక గుర్తు ‘వరి కంకి’పై పోటీ చేస్తున్నారు.  తారిఖ్ రెహమాన్ 2008 నుంచి లండన్‌‌లో ఉంటున్నారు.  ఈ ఏడాది డిసెంబర్ 25న స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన, డిసెంబర్ 27న ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి తన వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ సమర్పించారు.