పాక్ నిజంగానే భారత రఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసిందా..? నోరు విప్పిన భారత్..

పాక్ నిజంగానే భారత రఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసిందా..? నోరు విప్పిన భారత్..

ప్రస్తుతం పాక్-భారత్ మధ్య శాంతియుత వాతావరణం దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే గతవారం రెండు దేశాల మధ్య పరిస్థితులు యుద్ధం దాకా వెళ్లిన సందర్భంలో రెండు దేశాలు మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ వాడిన అనేక చైనా మిసైళ్లు, టర్కీ డ్రోన్లు భారత్ ఉపయోగించిన ఆయుధాల ముందు నిలువలేకపోయాయని ప్రపంచం మెుత్తం చూసింది.

ఈ క్రమంలో భారత్ డసాల్ట్ ఏవియేషన్ ద్వారా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి భారత వాయుసేనలో అత్యంత అధునాతనమైన అత్యుత్తమ పనితీరు కలిగిన మోడ్రన్ యుద్ధ విమానాలుగా ఇవి పేరుగాంచాయి.   చైనా తయారు చేసిన జే10 విమానం రఫెల్ ను కూల్చివేసినట్లు అమెరికా అధికారులు శుక్రవారం వెల్లడించారు. పాక్ డిఫెన్స్ మినిస్టర్ క్వాజా మెుహమద్ ఆసిఫ్ కూడా భారత దేశానికి చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చేసినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇయితే పాకిస్థాన్ రఫెల్ విమానాన్ని దాడుల్లో కూల్చివేసినట్లు వచ్చిన వార్తలపై భారత్ స్పందించింది. ఆదివారం ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ యుద్ధంలో ఉన్నప్పుడు కొన్ని నష్టాలు జరగటం సహజమేనని అన్నారు. అలాగే యుద్ధ విమానాలను నడిపిన అందరు పైలట్లు క్షేమంగా తిరిగి వచ్చారని స్పష్టం చేశారు. దీనిని చూస్తుంటే అసలు రఫెల్ విమానాన్ని పాక్ నిజంగానే కూల్చేసిందా అనే అంశంపై భారత్ క్లారిటీ ఇవ్వలేదు. 

ఈ పరిస్థితులతో డసాల్ట్ ఏవియేషన్ షేర్లు కుప్పకూలటానికి కారణమైంది. కొన్ని రోజుల కిందట ఈ కంపెనీ షేర్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే పాక్ తన చైనా విమానంతో రఫెల్ ని కుప్పకూల్చగలిగిందనే వార్త పెద్ద షాక్ వేవ్స్ క్రియేట్ చేసింది. దీంతో యూరోపియన్ లిస్టెడ్ స్టాక్ ధర గడచిన 5 రోజుల్లో దాదాపు 10 శాతం పతనాన్ని చూసింది. వాస్తవానికి స్టాక్ ధర ప్రభావం కావటానికి కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఆకాశంలో యుద్ధం విషయంలో ఈ జెట్స్ ఎలా పనిచేస్తున్నాయి, వాటి టెక్నాలజీ వంటి అంశాలపై చాలా మంది నిశితంగా పరిశీలిస్తున్నారు. అమెరికా సదరు జెట్స్ పనితీరును నిశితంగా పరిశీలిస్తోందని తెలుస్తోంది. తైవాన్ విషయంలో అమెరికా చైనాతో గొడవ ఏర్పడితే ఎలా ముందుకెళ్లాలో జాగ్రత్త పడేందుకు ఈ డేటాను వినియోగించుకుంటోందని సమాచారం.