
కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన దాసరి నారాయణ పెద్ద కుమారుడు దాసరి ప్రభు ఆచూకీ లభ్యమైంది. మంగళవారం సాయంత్రం ప్రభు తన నివాసానికి చేరుకున్నాడు. ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రభు ఆ తర్వాత కనిపించలేదు. దీంతో తన అల్లుడు కనిపించడం లేదంటూ ప్రభు మామయ్య సురేంద్ర ప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దాదాపు వారం రోజుల తర్వాత ప్రభు తనంతట తానుగా మంగళవారం సాయంత్రం తన ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతను జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.