తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్

తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్

తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ మాజీ నేత దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్  తరుణ్ చుగ్ సమక్షంలో  బీజేపీలో చేరారు. దాసోజు శ్రవణ్ తోపాటు ఆయన మద్దతదారులు పలువురు బీజేపీలో చేరారు.  దాసోజు శ్రావణ్ కు తరుణ్ చుగ్ పార్టీ సభత్వం ఇచ్చారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి  కండువా కప్పి దాసోజు శ్రావణ్ ను  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ  కార్యక్రమానికి  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి,  ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు హాజరయ్యారు. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజని తరుణ్ చుగ్ అన్నారు.   తెలంగాణలో  సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ .. ఆయనతో పాటు కొంతమంది మద్దతుదారులు బీజేపీలో చేరారని అన్నారు. తెలంగాణలో బీజేపీ అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడతారని అన్నారు

ఈ సందర్బంగా మాట్లాడిన దాసోజు శ్రవణ్... నరేంద్ర మోడీ , బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని  అన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి , వివేక్ వెంకటస్వామి, మురళిధర్ రావు, లక్ష్మణ్ లకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేశానని.. ఇప్పుడు సొంతింటికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. 60 వేల అప్పు ఉన్న రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క సాగు నీటి ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుని లక్ష 15 వేల కోట్లకు పెంచిండన్నారు.