రైతులకు శాపంగా మారిన ధరణి వెబ్ సైట్ 

 రైతులకు శాపంగా మారిన ధరణి వెబ్ సైట్ 

వడ్ల కొనుగోళ్లపై  టీఆర్ఎస్, బీజేపీ ఆడిన డ్రామాలో  రైతులే బలయ్యారన్నారని AICC  అధికార  ప్రతినిధి  దాసోజు శ్రవణ్ అన్నారు. కొనుగోలు  కేంద్రాల్లో గన్నీ బ్యాగులు,  టార్పాలిన్ల  కొరతతో  రైతులు ఇబ్బందులు  పడుతున్నారని చెప్పారు. ప్రజల  సొమ్ముని  పంజాబ్ రైతులకు  ఖర్చు పెట్టారని  ఫైర్ అయ్యారు. జనం  సొమ్ముతో  అడ్వర్టైజ్ మెంట్లు  ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని విమర్శించారు. తెలంగాణ సర్కార్ అన్నదాతల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. పెట్టిన పెట్టుబడి రాక..వడ్డీలు కట్టలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు భరోసా కల్పించామని చెప్పారు. కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. ధరణి వెబ్ సైట్ అన్నదాతల పాలిట శాపంలాగ మారిందన్నారు. పంట నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం

బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది

సెలవుల్లో డాన్స్ పై స్టూడెంట్స్ ఆసక్తి