సెలవుల్లో డాన్స్ పై స్టూడెంట్స్ ఆసక్తి

సెలవుల్లో డాన్స్ పై స్టూడెంట్స్ ఆసక్తి

వరంగల్ జిల్లా: వేసవి సెలవుల్లో డ్యాన్స్ నేర్చుకునేందుకు అసక్తి చూపిస్తున్నారు  స్టూడెంట్స్. నచ్చిన పాటలకు డ్యాన్స్  చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నారులకు కూడా డ్యాన్స్ లతో హడావిడి చేస్తున్నారు. సమ్మర్ హాలీడేస్ లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ సందడి చేస్తున్నారు వరంగల్ స్టూడెంట్స్. హన్మకొండలోని డ్యాన్స్ సెంటర్ లో చాలామంది చిన్నారులు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వీళ్లకు శాస్త్రీయ,జానపద,పాశ్చాత్య సంగీతం, సినిమా పాటలకు డ్యాన్స్ నేర్పిస్తున్నారు మాస్టర్స్. కొందరు చిన్నారులు బుడి బుడి అడుగులతో సినిమా పాటలకు స్టెప్పులెస్తుంటే చూసి మురిసిపోతున్నారు పేరెంట్స్. చదువుతో పాటు  డ్యాన్స్ అంటే ఇష్టమంటున్నారు  స్టూడెంట్స్. రోజూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఎంజాయ్ గా ఉందని చెబుతున్నారు.

 వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం ఇష్టంలేక  డాన్స్ కోచింగ్ సెంటర్ లో చేరామంటున్నారు కొందరు స్టూడెంట్స్. ఫిట్ గా ఉండేందుకు డ్యాన్స్ బాగా ఉపయోగపడతదంటున్నారు.  ఇప్పుడు నేర్చుకుంటున్న డాన్సులు స్కూల్ ఫంక్షన్లలో ప్రదర్శిస్తామంటున్నారు మరికొందరు విద్యార్థులు. డ్యాన్స్ చేయడం వల్ల తమకు బహుమతులు వచ్చాయని చెబుతున్నారు. స్టూడెంట్స్  ఇంట్రెస్ట్ ను బట్టి మోడ్రన్ డ్యాన్స్ తో పాటు భరత నాట్యం,కూచిపూడి  నేర్పిస్తున్నామన్నామన్నారు  డ్యాన్స్ కోచింగ్ సెంటర్ నిర్వహకులు. తమ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న ఎంతో మంది స్టూడెంట్స్ కు పోటీల్లో అవార్డులొచ్చాయని తెలిపారు. సెలవుల్లో నచ్చిన పాటలకు డ్యాన్స్ నేర్చుకోవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు స్టూడెంట్స్.

మరిన్ని వార్తలు..

పీవీ బయోపిక్ లో ఎవరికీ తెలియని విషయాలు

12 దేశాల్లో మంకీ ఫాక్స్..ఇప్పటి వరకు ఎన్నికేసులంటే

మహిళా ఎంపీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు