
టీఆర్ఎస్ మిడతల దండు సాగర్ లో దిగిందన్నారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. నాగార్జున సాగర్ లో ఓటమి భయంతో కేసీఆర్ టీఎన్జీవో లను కూడా రంగంలోకి దింపాడన్నారు. వాళ్లంతా ఉద్యోగులు కాదని... టీఆర్ఎస్ మిడతల దండన్నారు. సిగ్గు లేకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని.. ఇప్పటికే హాలియాకు వచ్చి మీటింగ్ పెట్టిన కేసీఆర్.. మళ్లీ హాలియాలో ఈ నెల 14న మీటింగ్ పెడుతున్నాడన్నారు. ఎన్ని కుట్రలు చేసినా జానా రెడ్డి గెలుపు ఖాయమన్నారు. సాగర్ లోని విజయ విహార్ గెస్ట్ హౌస్ లో టీఎన్జీవోలు ఎలా మీటింగ్ పెడ్తారని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ కు ఫిర్యాదు చేశామన్నారు.