చెన్నూరులో చెల్లని పైసా పెద్దపల్లి లో చెల్లుతుందా? : శ్రావణ్

చెన్నూరులో చెల్లని పైసా పెద్దపల్లి లో చెల్లుతుందా? : శ్రావణ్

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడం ఆ పార్టీకి చెంపపెట్టని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ అన్నారు. ‘ముగ్గురు ఎమ్మెల్సీల  గెలుపు సరికొత్త ప్రజాస్వామిక తెలంగాణకు నాంది.. తెలంగాణ మేధావులు  ఉద్యోగస్తులు ప్రజల పక్షాన ఉన్నారు. బ్యాలెట్ పేపర్ లతో ఎన్నికలు పెట్టడం వలన mlc ఎన్నికల్లో గెలిచాం. ఈవీఎంలను మ్యానేజ్ చేసి ముందస్తు ఎన్నికల్లో trs గెలిచింది. పోస్టల్ బ్యాలెట్ లు ఎవరికి ఎక్కువ వస్తే వారే ఎక్కువ సీట్లు గెలుస్తారు. కానీ ముందస్తు ఎన్నికల్లో మాకు 73 ప్రాంతాల్లో పోస్టల్ ఓట్లు ఎక్కువ గా వచ్చాయి. trs కు 28 స్థానాల్లో పోస్టల్ ఎక్కువ వచ్చాయి.. కానీ trs కు 88 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 19 వచ్చాయి.

చెన్నూరులో చెల్లని పైసా పెద్దపల్లి లో చెల్లుతుందా? ఖమ్మం అసెంబ్లీలో చెల్లని రూపాయి ఖమ్మం పార్లమెంట్ లో చెల్లుతుందా? ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పోటీచేసిన అభ్యర్థులు కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. వారి అభ్యర్థులని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడేమో తగుదనమ్మా అంటూ మా అభ్యర్థులు కారని చెప్పుకుంటున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రాబోతున్నాయి. తప్పు చేస్తారని ఊహించి ఏపీ లో IAS, IPS లను తీసివేస్తూన్నారు… ఇక్కడ 20 లక్షల ఓట్లు తీసివేశారని రజత్ కుమార్ పై  ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు‘ అని ప్రశ్నించారు.