నిందితులకు 3 వారాల్లో శిక్షపడేలా చర్యలు తీసుకోవాలె

నిందితులకు 3 వారాల్లో శిక్షపడేలా చర్యలు తీసుకోవాలె

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. బచావో హైదరాబాద్ పేరుతో కాంగ్రెస్ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శాంతి భద్రతల విషయంలో అధికారపార్టీ కఠినంగా వ్యవహరించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి మూడు వారాల్లోగా శిక్ష పడేలా చూడాలని, ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.

పొరుగు రాష్ట్రం ఏపీలో అఘాయిత్యాలకు పాల్పడిన వారికి 56 రోజుల్లోనే శిక్ష విధించిన విషయాన్ని  శ్రవణ్ గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ ఇలాంటి పద్దతి అవలంబించి నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం వచ్చేలా చేయాలని అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచడంతో పాటు.. వారి కోసం ప్రత్యేకంగా మూడంకెల నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు.