రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీలా ఉంది

V6 Velugu Posted on Jun 04, 2021

జర్నలిస్ట్ రఘు అరెస్ట్ దారుణమన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. రోడ్డుపై వెళ్తున్న రఘును కిడ్నప్ తరహాలో పోలీసులు దొంగల్లా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. నిజాం నవాబు ఖాసీం రజ్వి కి వ్యతిరేకంగా వార్తలు రాసిన షోయబుల్లా ఖాన్ ను ఏ తరహాలో హతమార్చారో..అదే తరహాలో కేసీఆర్ పాలన కనిపిస్తోందన్నారు. ఉద్యమ పార్టీ కాస్తా.. ఉన్మాద పార్టీగా మారిందని విమర్శించారు. పోలీసులు కూడా..గులాబీ పార్టీకి గులాంలా మారారన్నారు. అంతేకాదు..రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీలా ఉందన్నారు దాసోజు శ్రవణ్. 

గాంధీ భవన్ అటెండర్ షబ్బీర్ కరోనా తో చనిపోయాడు. ఎంతో కాలంగా గాంధీ భవన్ లో సేవలు చేసిన..షబ్బీర్ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్.

Tagged dasoju sravan, state, undeclared emergency

Latest Videos

Subscribe Now

More News