ఎల్ బీనగర్, వెలుగు: ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తుల డేటాను ఆన్‌లైన్ ద్వారా వెబ్ సైట్ లో ఎంట్రీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సిబ్బందిని నియమించామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె. శశాంక్ తెలిపారు.
సోమవారం బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ఆఫీసులో దరఖాస్తులను వెబ్ సైట్ లో ఎంట్రీ చేస్తున్న తీరును ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి, సూపర్ వైజర్లు, వార్డు ఆఫీసర్లు ఉన్నారు.
