ఏఐలో క్వాలిటీ ఇంజినీరింగ్ కీలకం.. వైట్ పేపర్లో పేర్కొన్న క్వాలిజీల్

ఏఐలో క్వాలిటీ ఇంజినీరింగ్ కీలకం.. వైట్ పేపర్లో పేర్కొన్న క్వాలిజీల్

హైదరాబాద్​, వెలుగు: ఏఐతో నడిచే ఆధునిక సాఫ్ట్‌‌‌‌వేర్​ డెలివరీలో క్వాలిటీకి ప్రాముఖ్యత పెరిగిందని సాఫ్ట్​వేర్ ​క్వాలిటీని పరీక్షించే హైదరాబాద్​కు చెందిన ఏఐ- పవర్డ్​ మోడర్న్​ క్వాలిటీ ఇంజినీరింగ్, డిజిటల్​ ట్రాన్స్​ఫర్మేషన్​ సొల్యూషన్స్ సంస్థ  క్వాలిజీల్ తెలిపింది.

  పరిశోధన సంస్థ ఎవరెస్ట్​ గ్రూప్ కలిసి "రీఇమాజినింగ్​ ఎంటర్​ప్రైజ్​ క్వాలిటీ" పేరుతో ఇది వైట్​పేపర్​ను విడుదల చేసింది.  సంప్రదాయ విధానం నుంచి ప్లాట్‌‌‌‌ఫామ్​- నేతృత్వంలోని క్వాలిటీ ఇంజినీరింగ్​ (క్యూఈ)కు మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వేగం ఖర్చు మాత్రమే కాకుండా, ఏఐ యుగంలో విశ్వసనీయత , వివరణ ముఖ్యమని తెలిపింది. 

తమ​ ఏఐ -పవర్డ్​ ప్లాట్‌‌‌‌ఫామ్ క్యూమెంటిస్ ఐ టెస్టింగ్​ సమయాన్ని 60 శాతం వరకు తగ్గిస్తుందని, నాన్​-ఫంక్షనల్​ టెస్టింగ్​ప్లాన్​ను 40 శాతం వేగవంతం చేస్తుందని పేర్కొంది. క్వాలిటీ ఇంజినీర్ల పాత్ర మాన్యువల్​ టెస్టింగ్​ నుంచి ఏఐ మోడల్​ వాలిడేషన్​, రిస్క్​ మానిటరింగ్​ వైపు మారుతున్నదని రిపోర్ట్​ స్పష్టం చేసింది.