ఫిజిక్స్ వాలా షేర్లు 42 శాతం జంప్

 ఫిజిక్స్ వాలా షేర్లు 42 శాతం జంప్

ముంబై: ఎడ్​టెక్​ యూనికార్న్​ ఫిజిక్స్​వాలా లిమిటెడ్​ షేర్లు మంగళవారం (నవంబర్ 18) స్టాక్​ మార్కెట్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 109తో పోలిస్తే 42 శాతం పైగా ప్రీమియంతో ముగిశాయి. ఈ స్టాక్​ బీఎస్​ఈలో ఇష్యూ ధర నుంచి 31.28 శాతం పెరిగి రూ. 143.10 వద్ద ట్రేడింగ్​ ప్రారంభించింది. 

ఇంట్రాడేలో రూ. 162.05 గరిష్ట స్థాయికి చేరి, చివరకు 42.38 శాతం లాభంతో రూ. 155.20 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈలో రూ. 145 వద్ద లిస్ట్​ అయింది. కంపెనీ మార్కెట్​ విలువ రూ. 44,382.43 కోట్లుగా ఉంది.