న్యూఢిల్లీ:ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో (క్యూ2) భారతదేశ జీడీపీ వృద్ధి 7.5 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. సెప్టెంబర్ చివర్లో జీఎస్టీ రేటు తగ్గింపు కారణంగా ఊపందుకున్న బలమైన పండుగ అమ్మకాలు దీనికి ప్రధాన కారణం.
పెట్టుబడి కార్యకలాపాలు పెరగడం, గ్రామీణ వినియోగం కోలుకోవడం, సేవలు తయారీ రంగాలలో ఉత్సాహం ఈ వృద్ధికి మద్దతు ఇస్తున్నాయి. ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం రిపోర్ట్ ప్రకారం, వినియోగం, డిమాండ్‌లో ప్రధాన సూచికల శాతం ఒకటో క్వార్టర్లో 70 శాతం నుంచి రెండో క్వార్టర్లో 83 శాతానికి పెరిగింది. ఈ నెలాఖరులో జులై–సెప్టెంబరు జీడీపీ డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
