హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్‌‌కి డేట్ ఫిక్స్

హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్‌‌కి డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ కెరీర్‌‌‌‌లో ఫస్ట్ టైమ్ నటిస్తున్న పీరియాడికల్‌‌ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీని ఎ.ఎమ్.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌‌‌‌ రావు నిర్మిస్తున్నారు. కొవిడ్‌‌తో పాటు రకరకాల కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. షూటింగ్ ఆపేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ కొత్త షెడ్యూల్‌‌కి డేట్ ఫిక్స్ చేశారు. ఆగస్టు 11 నుంచి షూట్ రీస్టార్ట్ చేయబోతున్నారు. ఓ పాటతో పాటు పవన్ కళ్యాణ్‌‌ క్యారెక్టర్‌‌‌‌కి సంబంధించిన సీన్స్ మొత్తం ఈ షెడ్యూల్‌‌లో పూర్తి చేయడానికి క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట. ఆ తర్వాత మిగతా వారి సీన్స్‌‌ని తెరకెక్కిస్తాడట. మొఘలుల కాలం నాటి ఫిక్షన్‌‌ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ అందరినీ ఇంప్రెస్ చేసింది. పవన్‌‌కి జంటగా నిధి అగర్వాల్‌‌ నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వీలయినంత త్వరగా ఈ సినిమాతో పాటు ‘వినోదాయ సిత్తం’ రీమేక్ కూడా కంప్లీట్ చేయనున్నారట పవన్. హరీష్‌‌ శంకర్‌‌‌‌తో ‘భవదీయుడు భగత్‌‌సింగ్‌‌’, సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోయే మరో సినిమాలో కూడా ఆయన నటించాల్సి ఉంది. అయితే రాజకీయాలపై ఫోకస్ పెట్టేందు కుగాను సినిమాల కు కొంత గ్యాప్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.