
ముషీరాబాద్, వెలుగు: అభివృద్ధి ఆగకుండా కొనసాగాలంటే కచ్చితంగా బీఆర్‌ఎస్ పార్టీని ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అన్ని మతాలను సమానంగా కేసీఆర్ చూశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలకు ఆత్మీయ భవనాలు పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టారని తెలిపారు. అభివృద్ధి ఆకాంక్షించే బీఆర్‌ఎస్ పార్టీ, అభ్యర్థి ముఠా గోపాల్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.