World Bank : వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ రాజీనామా

World Bank : వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ రాజీనామా

ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ పదవికి డేవిడ్ మాల్పాస్ రాజీనామా చేయనున్నారు. పదవీకాలం ఇంకా ఏడాది ఉండగానే ఆయన అర్థాంతరంగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2019లో డేవిడ్ మాల్పాస్ ను డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునిగా నియమించారు. పేద, అభివృద్ధిచెందే దేశాలకు ఆర్థిక సాయం అందించడంలో డేవిడ్ మాల్పాస్ ది కీలక పాత్ర ఉంది. అయితే, ఏడాది పదవికాలం ఉండగానే రాజీనామా ప్రకటించడంపై కొన్ని ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

అయితే, గతంలో  డేవిడ్ మాల్పాస్.. శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల భూగ్రహం ప్రమాదకరంగా వేడెక్కుతుందనే శాస్త్రీయ వాదనకు ఏకాభిప్రాయాన్ని తెలియజేశారు. దీనిపై అంతర్జాతీయంగా చర్చలు నడిచాయి. ఈ విషయంపై  డేవిడ్ మాల్పాస్ ను రాజీనామా చేయవలసిందిగా పలువురు ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తుంది.