
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్.. ఈ ఇద్దరిట్లో ఎవరు బెటర్ బ్యాట్స్‌మెన్ అన్న చర్చలు జరుగుతుంటాయి. చాలామంది విరాట్ కోహ్లీ పేరునే చెప్తుంటారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్ జట్టుకు ఆడుతున్న మిల్లర్ ఒక స్పోర్ట్స్ వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ, బాబర్ ఇద్దరూ కవర్ డ్రైవ్ లు బాగా ఆడతారు. కానీ, పర్ఫెక్ట్‌గా బాబర్ ఆజమ్ బ్యాట్ నుంచి వస్తుంది. ఈ విషయంలో ఆలోచించాల్సిన పనిలేదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. మిల్లర్ మాటలకు కోహ్లీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.