రష్మిక మందాన ఫేస్ను మార్ఫింగ్ చేసిన వార్నర్

రష్మిక మందాన ఫేస్ను మార్ఫింగ్ చేసిన వార్నర్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్..మైదానంలో ఎంత డాషింగ్గా ఉంటాడో..బయట అంత  ఉల్లాసంగా గడుపుతుంటాడు. ధనాధన్ బ్యాటింగ్తో అభిమానులను అలరించే వార్నర్..రీల్స్ చేస్తూ..అభిమానులను థ్రిల్కు గురిచేస్తుంటాడు. ఇప్పటికే టాలీవుడ్ డైలాగ్స్తో పాటు.. మహేష్ బాబు శ్రీమంతుడు, అల్లు అర్జున్ పుష్ప  సినిమాల్లోని సన్నివేశాలను స్పూఫ్ చేసి ఆకట్టుకున్న వార్నర్..మరో స్పూఫ్ వీడియోతో ఆశ్చర్యపరిచాడు. 

https://www.instagram.com/reel/Ck8AnaDPavL/?utm_source=ig_web_copy_link

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాల సాంగ్స్‌కు వార్నర్ డ్యాన్సులతో ఇరగదీశాడు. ఫేమస్ డైలాగ్స్తో  వీడియోలు చేస్తూ..హీరోలు, డైరెక్టర్ల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇన్నాళ్లు హీరోల డైలాగ్స్, సాంగ్స్నే స్పూఫ్ చేసిన వార్నర్..తాజాగా టాప్ హీరోయిన్ సాంగ్ను స్పూఫ్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. హీరోల ముఖాలకు తన ఫేస్ పెట్టి స్పూఫ్ వీడియోలు చేసిన వార్నర్..ఈ సారి హీరోయిన్ రష్మిక మందానా ఫేస్ను తన ముఖంగా మార్చుకున్నాడు. 

నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమాలోని వాటే బ్యూటీ  సాంగ్ను స్పూఫ్ చేశాడు. ఇందులో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు అనే లిరిక్స్‌ను ఎడిట్ చేశాడు. రష్మిక ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తను ఇమిటేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.  ఈ వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. 

మరిన్ని వార్తలు