
అప్పుడు బుట్టబొమ్మకు.. ఇప్పుడు డాన్2కు..
ఇండియన్ సినిమాలంటే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు చాలా ఇంట్రస్ట్. వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఓ పాటకు స్టెప్పేస్తూ.. ఫేమస్ డైలాగ్‌ను ఇమిటేట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటాడు. ‘బుట్టబొమ్మా’ పాటకు వైఫ్‌తో కలిసి వేసిన స్టెప్పులతో సోషల్ మీడియాలో తెగ సందడి చేశాడు. అప్పటి నుంచి పలు ఫేమస్ హీరోల్లా కనిపిస్తూ మరింత కిక్ ఇస్తున్నాడు. ఇందుకు రీఫేస్ యాప్‌ను యూజ్ చేస్తున్నాడు. తాజాగా డాన్2లో షారూక్ ఖాన్‌లా కనిపించిన ఓ వీడియోను వార్నర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. స్టంట్స్ చేస్తున్న షారూక్ ఫేస్‌కు బదులు యాప్ సాయంతో తన ఫేస్ వచ్చేలా చేశాడు. వీడియోలో కనిపించే హింసకు సారీ చెప్పిన డేవిడ్.. అందులో ఉన్న యాక్టర్‌ను కనిపెట్టడం కష్టం అవుతుందని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, షారూక్ ప్లేస్‌లో ఉన్నది వార్నర్ అని అభిమానులు ఇట్టే గుర్తు పట్టగా.. ఇప్పుడీ వీడియో ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. ఒక్క రోజులోనే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
https://www.v6velugu.com/wp-content/uploads/2020/12/132383220_387190125913760_1308922422473534750_n.mp4
For More News..
కాంగ్రెస్‌లో జరుగుతున్నది ఘర్షణ కాదు.. సంఘర్షణ
అప్పులకు ఫుల్ డిమాండ్!
లాక్‌డౌన్‌లో పానీ పూరికి 2 లక్షల ఆన్‌లైన్ ఆర్డర్లు