IPL Auction 2024: సన్‌ రైజర్స్‌ అత్యుత్సాహం.. వార్నర్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్

IPL Auction 2024: సన్‌ రైజర్స్‌ అత్యుత్సాహం.. వార్నర్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ అత్యుత్సాహం అభిమానులకు అగ్రహాన్ని తెప్పిస్తోంది. అందుకు కారణం తెలుగు అభిమానులంతా వార్నర్‌ బాయ్‌ అని పిలుచుకునే ఆసీస్‌ ఓపెనర్‌ సోషల్ మీడియా ఖాతాలు(ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌) బ్లాక్‌ చేయడమే. ఈ విషయాన్ని వార్నరే స్వయంగా స్క్రీన్‌ షాట్స్‌ తీసి మరీ వెల్లడించాడు. అందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లు సోషల్ మీడియాలో కనిపించగానే తెలుగు అభిమానులు సన్‌ రైజర్స్‌ యజమాని కావ్య మారన్ ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్లు పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్  రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయారు. స్టార్క్ వేలంలోకి రాక ముందు పాట్‌ కమిన్స్‌ 20 కోట్లకు సం రైజర్స్ దక్కించుకోగా.. స్టార్ ఓపెనర్  ట్రావిస్‌ హెడ్‌ ను  ఎస్‌ఆర్‌హెచ్‌.. రూ. 6.8 కు కొనుగోలు చేసింది. ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పేందుకు గాను వార్నర్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాలని చూశాడు. కానీ సన్‌ రైజర్స్‌ మాత్రం వార్నర్‌ను బ్లాక్‌ చేసింది.

వార్నర్ దీనిపై స్పందిస్తూ.." ట్రావిస్‌ హెడ్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ను రీపోస్ట్‌ చేయాలని ప్రయత్నించాను. కానీ సన్‌ రైజర్స్‌ నన్ను బ్లాక్‌ చేసింది.. ’ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. వార్నర్‌ ఎప్పుడైతే ఈ పోస్టు చేసాడో అభిమానులు హైదరాబాద్‌ ఫ్రాంచైజీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. గతంలో వార్నర్‌ను సారథిగా తప్పించి అవమానించారని.. తాజాగా అతనిని బ్లాక్ చేశారని అభిమానులు మండిపడుతున్నారు. సన్ రైజర్స్ జట్టుకు టైటిల్ అందించిన వార్నర్ పై ఏ మాత్రం గౌరవం లేదని తిట్ల వర్షం కురిపిస్తున్నారు.